This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

డిస్పోజల్ టాయిలెట్ పేపర్ సీట్ కవర్లు అంటువ్యాధులను అరికట్టడంలో సహాయపడతాయా?

Pregnancy
Written by - Sarada Ayyalaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
డిస్పోజల్ టాయిలెట్ పేపర్ సీట్ కవర్లు అంటువ్యాధులను అరికట్టడంలో సహాయపడతాయా?
Likes2 Likes|
Read time5 min

పబ్లిక్ రెస్ట్ రూంను ఉపయోగించినపుడు అంటు వ్యాధుల బారిన పడకుండా కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ సొంతంగా జాగ్రత్తలను పాటిస్తారు. కొంత మంది టాయిలెట్ సీట్ కవర్లను ఉపయోగిస్తారు. మరికొంత మంది టాయిలెట్ సీట్ మీద పూర్తిగా కూర్చోకుండానే టాయిలెట్​ను ఉపయోగించుకుంటారు. కానీ పబ్లిక్ టాయిలెట్​ను ఉపయోగించినపుడు అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకు ఉత్తమ మార్గం ఏమిటి?

టాయిలెట్ సీట్లు సాధారణంగా ఇన్ఫెక్షన్లను కలిగించే బ్యాక్టీరియాలతో ఉంటాయి. వాటిని మనం చూడలేనప్పటికీ ఇటువంటి బ్యాక్టీరియాలు టాయిలెట్ సీటుతో పాటు ప్రతి చోట ఉంటాయి.

చాలా సందర్భాల్లో ఈ బ్యాక్టీరియా ఎటువంటి హాని కలిగించదు. కానీ కొన్ని సార్లు మాత్రం ఈ బ్యాక్టీరియా కొన్ని ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. ఈ బ్యాక్టీరియాల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఒక మార్గం డిస్పోజబుల్ పేపర్ టాయిలెట్ సీట్ కవర్లు.

ఇవి నిజంగా ప్రయోజనకరంగా ఉంటాయా?

పేపర్ టాయిలెట్ సీట్ కవర్లు అంటువ్యాధులను నివారించడంలో ఎలా సహాయపడతాయో ఇక్కడ చూద్దాం.

అసలు పేపర్ టాయిలెట్ సీట్ కవర్లు అంటే ఏమిటి?

పేపర్ టాయిలెట్ సీట్ కవర్లు పలుచగా ఉండే పేపర్ షీట్స్. ఇవి రీసైకిల్ చేసిన కాగితంతో తయారు చేస్తారు. దాని అర్ధం మీరు వాటిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. పేపర్ టాయిలెట్ సీట్ కవర్లు టాయిలెట్ సీటు మీద ఉండే బ్యాక్టీరియాలకు మరియు మానవచర్మానికి మధ్య అవరోధంగా ఉంటాయి. ప్రజలు వాటిని పరిశుభ్రత, సౌకర్యం, మనశ్శాంతి కోసం ఉపయోగిస్తారు.

పేపర్ టాయిలెట్ సీట్ కవర్లు పని చేస్తాయా?

పేపర్ టాయిలెట్ సీటు కవర్లు ఇన్ఫెక్షన్లు మరియు బ్యాక్టీరియా వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడతాయి. టాయిలెట్ సీటు కవర్లు మానవశరీరం మరియు టాయిలెట్ సీటు మధ్య అవరోధంలా ఉండి.. బ్యాక్టీరియా శరీరానికి తగలకుండా చేస్తా యి. ఈ కవర్లను వాడిన వ్యక్తికి బ్యాక్టీరియాతో ఎక్కువగా సమస్యలు రావు. పేపర్ టాయిలెట్ సీట్ కవర్​ను ఉపయోగించడం వలన టాయిలెట్ సీట్ క్లీన్​గా ఉండడంతో పాటుగా బ్యాక్టీరియా రహితంగా ఉంటుంది.

టాయిలెట్ సీట్ పేపర్ కవర్లను ఎలా ఉపయోగించాలి?

పేపర్ టాయిలెట్ సీట్ కవర్ల నుంచి ఎక్కువ ప్రయోజనం పొందడం కోసం వాటిని ఎలా వాడాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పేపర్ టాయిలెట్ సీట్ కవర్లను ఎలా ఉపయోగించాలో ఇక్కడ దశల వారీగా ఉంది.

1. కూర్చోవడానికి ముందు టాయిలెట్ సీట్​ను ఓ సారి చూడండి. అది శుభ్రంగా లేకపోతే పేపర్ టవల్ లేదా టాయిలెట్ సీట్ క్లీనర్​తో దానిని తుడవండి.

2. ప్యాకేజ్ నుంచి పేపర్ టాయిలెట్ సీట్ కవర్​ని బయటకు తీసి మడత విప్పండి.

3. కాగితాన్ని టాయిలెట్ సీటుపై ఉంచండి. మధ్యలో ఉన్న రంధ్రం టాయిలెట్ బౌల్​తో సమానంగా ఉండేలా చూసుకోండి.

4. ఒకసారి పూర్తయిన తర్వాత టాయిలెట్ సీట్ కవర్​ను టాయిలెట్​లో ఫ్లష్ చేయండి.

5. సబ్బు మరియు నీటితో చేతులను శుభ్రంగా కడుక్కోండి.

పేపర్ టాయిలెట్ సీట్ కవర్లను ఉపయోగించేందుకు ఇదే అత్యంత ప్రభావవంతమైన మార్గం. రెస్ట్ రూం వాడిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి.

పేపర్ టాయిలెట్ సీట్ కవర్లు సురక్షితమేనా?

పేపర్ టాయిలెట్ సీట్ కవర్లు ఉపయోగించడం సురక్షితం. మరియు వీటి వలన ఒకరి ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు ఉండదు. ఇవి బ్యాక్టీరియా మరియు ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. అనేక పేపర్ టాయిలెట్ సీట్ కవర్లు రీసైక్లింగ్ పేపర్​తో తయారు చేస్తారు. ఇలా చేయడం వలన అవి పర్యావరణ హితంగా ఉంటాయి.

పేపర్ టాయిలెట్ సీట్ కవర్లను ఎప్పుడు ఉపయోగించాలి?

పేపర్ టాయిలెట్ సీట్ కవర్లను ఉపయోగించేందుకు ప్రత్యేకంగా కొన్ని పరిస్థితులు ఉన్నాయి. వాటిల్లో కొన్ని:

• టాయిలెట్ సీట్ మురికిగా ఉంటే: ఈ సందర్భాల్లో ఎక్కువ మంది పేపర్ టాయిలెట్ సీట్ ‘కవర్లను ఉపయోగిస్తారు. ఇది తరచూ కనిపించే పరిస్థితి. టాయిలెట్ సీట్ అపరిశుభ్రంగా మరియు మురికిగా ఉంటే అధిక రక్షణ కోసం పేపర్ టాయిలెట్ సీట్ కవర్​ను ఉపయోగించడం చాలా మంచి ఆలోచన.

• టాయిలెట్ సీట్ తడిగా ఉంటే: ఇటువంటి సందర్భాల్లో తేమతో బ్యాక్టీరియా మీకు సోకకుండా ఉండేందుకు పేపర్ టాయిలెట్ సీట్ కవర్​ను ఉపయోగించడం అత్యుత్తమం.

• పబ్లిక్ రెస్ట్ రూం ఉపయోగించుకున్నపుడు: పేపర్ టాయిలెట్ సీట్ కవర్లు తప్పకుండా అవసరమయ్యే ప్రాంతం పబ్లిక్ రెస్ట్ రూం. ఎందుకంటే చాలా మంది పబ్లిక్ రెస్ట్ రూంలను ఉపయోగించుకోవడం వలన అవి కలుషితంగా తయారవుతాయి.

• వ్యక్తికి తక్కువ రోగనిరోధక శక్తి ఉంటే: వ్యక్తికి తక్కువ రోగ నిరోధక శక్తి ఉంటే అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో పేపర్ టాయిలెట్ సీట్ కవర్లను ఉపయోగించడం వలన బ్యాక్టీరియాల నుంచి తమని తాము రక్షించుకోవచ్చు.

పేపర్ టాయిలెట్ సీట్ కవర్లను ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలు

పేపర్ టాయిలెట్ సీట్ కవర్ల వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని ఒక్కసారి పరిశీలిస్తే:

• ఇన్ఫెక్షన్ ప్రమాదాలను తగ్గిస్తుంది: మైలో కేర్ టాయిలెట్ పేపర్ సీట్ కవర్లు ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఒక అతి ముఖ్యమైన ప్రయోజనం.

• పరిశుభ్రత: పేపర్ టాయిలెట్ సీట్ కవర్లు కూడా పరిశుభ్రతను పెంచడంలో సహాయపడతాయి. ఇవి టాయిలెట్ సీట్​ను శుభ్రంగా మరియు బ్యాక్టీరియా లేకుండా ఉంచడం వలన సూక్ష్మక్రిముల వ్యాప్తిని అరికడతాయి.

• సౌకర్యం: పేపర్ టాయిలెట్ సీట్ కవర్లు మీకు సౌకర్యాన్ని అందజేస్తాయి. పబ్లిక్ రెస్ట్ రూమ్స్​లో టాయిలెట్ సీట్లు గట్టిగా ఇంకా అసౌకర్యంగా ఉన్న చోట ఇవి సౌకర్యాన్ని అందిస్తాయి.

• ప్రయాణ భద్రత: ప్రయాణాలు చేసేటపుడు సురక్షితంగా ఉండేందుకు ట్రావెల్​ టాయిలెట్ సీట్ కవర్స్ గొప్ప మార్గం. మైలో కేర్ టాయిలెట్ పేపర్ సీట్ కవర్లను మీరు ఉపయోగించడం వల్ల విదేశాల్లో ఎక్కువగా ఉండే బ్యాక్టీరియా, ఇతర వైరస్​ల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

చివరగా

చివరగా చెప్పేదేంటంటే.. పేపర్ టాయిలెట్ సీట్ కవర్లు ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో గొప్పగా సహాయపడతాయి. ఇవి పరిశుభ్రతను మెరుగుపరుస్తాయి. ఎక్కువ ప్రయోజనాలు పొందేందుకు వాటిని సరిగ్గా ఉపయోగించడం చాలా అవసరం. మీరు పేపర్ టాయిలెట్ సీట్ కవర్​ని ఉపయోగించినా లేకపోయినా రెస్ట్ రూంని ఉపయోగించిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవడం చాలా అవసరం.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.